: లంక జైళ్లలో మగ్గుతున్న 200 మంది తమిళనాడు మత్స్యకారులు


సరిహద్దు తగాదాలతో తమిళనాడు, శ్రీలంక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. తమిళనాడు మత్స్యకారులు తమ భూభాగంలోకి చొరబడ్డారని, లేక కాలు పెట్టారన్న కారణాలతో ఇప్పటికే పలువురు మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. దాంతో, ప్రస్తుతం అక్కడి జైళ్లలో రెండొందల మంది మత్స్యకారులు మగ్గుతున్నారు. వారిని విడిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పలుమార్లు ప్రధానికి లేఖ కూడా రాశారు. అటు మత్స్యకారుల కుటుంబాలు సహాయం చేయాలని అర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోపు మత్స్యకారులు విడుదలవుతారని జయ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News