: ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో రూపాయికి ఇడ్లీ!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 'రూపాయికి ఇడ్లీ' పథకం ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ పథకాన్ని ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో కూడా ప్రవేశపెడుతున్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా మూడు రోజుల పాటు భవన్ లో ఈ పథకం అమలవుతుంది. తమిళనాడు భవన్ లో నిన్నటి నుంచే ఈ రూపాయికి ఇడ్లీ పథకం అమలవుతోంది. ఇక లెమన్ రైస్, సాంబార్, ఇతర ఆహారాలు ప్లేట్ ఐదు రూపాయలే.