: విషమంగా నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం


కోల్ కతాలోని సిటీ హోమ్ ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పైనే ఉన్నారని, రక్తంలో ఆక్సిజన్ మోతాదు తగ్గిందని చెప్పారు. అంతేకాక గుండె, రక్తపోటు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వెంట కుమార్తె మున్ మున్ సేన్, మనవరాళ్లు రైమా, రియా సేన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News