: జైపాల్ చెడపుట్టాడు: అడుసుమిల్లి


సీమాంధ్రుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ కూడా అదే స్థాయిలో నోరుపారేసుకున్నారు. ప్రకాశం పంతులు పుట్టిన గడ్డపై శుంఠలు పుట్టారని జైపాల్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనికి అడుసుమిల్లి స్పందిస్తూ.. జైపాలే పరమశుంఠని వ్యాఖ్యానించారు. రావి నారాయణరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి మహానుభావులు పుట్టిన నేలపై జైపాల్ చెడపుట్టారని వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డికి మనోవైకల్యం వచ్చిందన్న నాటి రాజీవ్ గాంధీ వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News