: చివరి బంతి కొట్టాల్సింది ఎంపీలు, ఎమ్మెల్యేలే: అశోక్ బాబు


సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏపీఎన్జీవోలు ఈసారి చివరి బంతి బాధ్యతను సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారు. ఈ మేరకు సమైక్యత విషయంలో చివరి బంతి కొట్టాల్సింది ఎంపీలు, ఎమ్మెల్యేలే అని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. వారి బాధ్యతను గుర్తు చేసేందుకు మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తోందని చెప్పారు. హైదరాబాద్ అందరిదని.. ఏ త్యాగానికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. సమైక్యవాదానికి మద్దతు పలకనివారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలు ఎదురవుతాయన్న అశోక్ బాబు శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News