: ప్రత్యేక ఉద్యమానికి రె'ఢీ'


ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రరూపం చేసేందుకు తెలంగాణ రాజకీయ ఐకాస సిద్ధమౌతోంది. ఇందుకోసం ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ఐకాస ప్రకటించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14, 15 నుంచి తెలంగాణ జిల్లాల ఐకాస సమావేశాలు, ఫిబ్రవరి 16న ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఫిబ్రవరి 18న ద్విచక్ర వాహన ర్యాలీలు, 19న శాసనసభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ వారికి ఉత్తరాలు, 20వ తేదీన ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మల దగ్ధం, 21న తెలంగాణ అంతటా అమర వీరులకు నివాళులర్పిస్తూ తెలంగాణ సాధన కోసం ప్రతిజ్ఞ చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది.

  • Loading...

More Telugu News