: దీనితో మీ జుట్టు కుదుళ్లు గట్టిపడతాయట


కొందరికి జుట్టు కుదుళ్లు బలహీనంగా ఉండడం వల్ల త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. అలాకాకుండా చక్కటి ఒత్తైన జుట్టు కావాలనుకుంటే... తాము తయారుచేసిన షాంపూను ఉపయోగించమని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీరు ఒక కొత్తరకం షాంపూను తయారుచేశారు. కార్ల ముందరి అద్దాలను బాగుచేసే ఒక సాంకేతిక విధానాన్ని ఉపయోగించి ఈ షాంపూను తయారుచేశారు. కార్ల ముందరి అద్దాల్లోని చిప్‌లలో ఉండే సిలికా జెల్‌ మాదిరిగా పనిచేసే ఫిలోగ్జాన్‌ అనే పదార్ధాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం షాంపూను తయారుచేశారు. ఫిలోగ్జాన్‌ వల్ల జుట్టు కుదుళ్లు బిరుసుగా మారుతాయని, దీంతో జుట్టు చిక్కగా ఉన్నట్టు అనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ షాంపూను జర్మనీలోని లూబెక్‌లో ఇటీవలే ఆవిష్కరించారు. దీన్ని తయారుచేసిన శాస్త్రవేత్త ఎలిజబెత్‌ దీన్ని గురించి మాట్లాడుతూ ఈ షాంపూలో పది శాతం ఫిలోగ్జాన్‌ ఉంటే దాన్ని ఉపయోగించడం వల్ల జుట్టును అరవై శాతం దళసరిగా మారుస్తుందని, సుమారు పదిసార్లు తలస్నానం చేసేవరకూ దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ముందుగా ఈ షాంపూను ఎలుకలపై ప్రయోగించి పరీక్షించినట్టు ఎలిజబెత్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News