: 'నేను మారి .. సమాజాన్ని మార్చుతాను' అనేది నినాదం కావాలి: సీబీఐ మాజీ జేడీ


'నేను మారి .. సమాజాన్ని మార్చుతాను' అనేది నినాదం కావాలని, ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగాలని యువతకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్, శామీర్ పేట మండలం జగ్గంగూడ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. విగ్రహాలు పెట్టి పూజిస్తే సరిపోదని, ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు. సాంకేతిక విద్య పెరిగిన కొద్ది మనుషుల మధ్య దూరం పెరుగుతుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News