: ముఖ్యమంత్రికి దమ్ముంటే తెలంగాణలో పార్టీ పెట్టాలి: కేటీఆర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలని... అప్పుడు అతని సత్తా ఏమిటో తెలుస్తుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ జరగకపోయినా, ఓటింగ్ జరగకపోయినా పర్వాలేదని... తెలంగాణ ఏర్పాటు ఆగే ప్రసక్తే లేదని అన్నారు. ఈ రోజు బోధన్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిజాం షుగర్స్ వజ్రోత్సవ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ వస్తే నిజాం షుగర్స్ ను ప్రభుత్వం టేకోవర్ చేస్తుందని చెప్పారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట తప్పారని... అందుకే ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయిందని విమర్శించారు.