: అక్రమ నిర్మాణాన్ని స్వయంగా కూల్చివేసిన జేపీ
లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ సమీపంలో ఉన్న వసంతనగర్ లో ఓ అక్రమ కట్టడాన్ని స్వయంగా కూల్చివేశారు. 60 అడుగుల రోడ్డును ఆక్రమించుకుని ఓ బిల్డర్ కట్టిన గోడను జేసీబీ సహాయంతో జేపీ కూల్చివేశారు. అంతకు ముందు రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న స్థానికులపై... బిల్డర్ అక్రమంగా కేసులు పెట్టాడు. దీంతో లోక్ సత్తా పార్టీ రంగంలోకి దిగింది. సహజంగా ఉన్న రహదారులు, నీటి ప్రవాహాలను ఆక్రమణలకు గురి కాకుండా చూసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉన్నప్పటికీ... ఆయన పట్టించుకోలేదని జేపీ విమర్శించారు.