: విద్యుత్ సరఫరా పెంచాల్సి ఉంది: మన్మోహన్
విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య ఉన్న తేడాను భర్తీ చేయాల్సిన అవసరముందని ప్రధాని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. రానున్న పదేళ్లలో అన్ని అవసరాల కోసం విద్యుత్ సరఫరాను నాలుగు రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా సహజవాయువు, చమురు కోసం అన్వేషిస్తున్న సంస్థలను సరైన రీతిలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.