: సానియామీర్జా, షోయబ్ మాలిక్... తలాక్ తలాక్?


టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా పెళ్లి పెటాకులవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ఇష్టపడి పెళ్లిచేసుకున్న సానియా ఇప్పుడు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. హైదరాబాదులో సానియామీర్జా నెలకొల్పనున్న టెన్నిస్ అకాడమీనే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇంతకు ముందు టెన్నిస్ అకాడమీని దుబాయ్ లో పెట్టాలని సానియా, షోయబ్ నిర్ణయించుకున్నారు. అయితే, చివరకు అకాడమీని హైదరాబాదులోనే పెట్టడానికి సానియా సిద్ధపడి, ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. ఇక్కడే వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. పాకిస్థాన్ ను వదిలి హైదరాబాద్ రావడానికి షోయబ్ ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ వివరాలు సానియామీర్జాకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి (ఓ రాజకీయ వేత్త కుమారుడు) ద్వారా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఒక నెల రోజుల్లో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News