: జైపాల్ రెడ్డి వయసు పెరిగి, మతి చలించి మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ
సీమాంధ్ర ప్రజలనుద్దేశించి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. వయసు పెరిగి, మతి చలించి జైపాల్ ఇలాంటి వాగుడు వాగుతున్నారని విమర్శించారు. సీఎం పదవి కోసమే జైపాల్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వెంటనే సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీనేతలు సీమాంధ్రులను కించపరచినా, తాము మాత్రం తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని చెప్పారు. ఈ రోజు దేవినేని ఉమ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.
జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక వార్తా పత్రికలో ఎందుకు రాలేదని ఉమ ప్రశ్నించారు. కిరణ్, జగన్, కేసీఆర్ లు కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీబిల్లుపై అసెంబ్లీలో ఇప్పటివరకు పది మంది కూడా మాట్లాడలేదని... కాబట్టి చర్చకు సమయాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు.