: సీమాంధ్ర కేంద్ర మంత్రులకు చీమూనెత్తురూ లేదా?: నన్నపనేని
సీమాంధ్ర నేతలను శుంఠలు అన్న జైపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి విరుచుకుపడ్డారు. జైపాల్ రెడ్డి ఇంత దారుణంగా మాట్లాడినా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఘోరమన్నారు. వారందరికీ ఆత్మాభిమానం, చీమూనెత్తురూ లేవా? అంటూ ప్రశ్నించారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలనే ఖండించలేని వీరు... సీమాంధ్రులను కాపాడతారా? అని విమర్శించారు.