: కిరణ్ దిగిపోయాకే మంత్రి పదవి చేపడతా: శ్రీధర్ బాబు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారం నుంచి తప్పుకున్నాకే మంత్రి పదవి చేపడతానని శ్రీధర్ బాబు అన్నారు. పదవులు ముఖ్యం కాదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షే ముఖ్యమని ప్రకటించారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ కచ్చితంగా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.