: మార్కెట్లను నష్టాల్లోకి నెట్టిన ప్రైవేటు బ్యాంకుల వ్యవహారం


నిన్న లాభాల బాటలో నడిచిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. నగదు బదిలీ వ్యవహారంలో మూడు ప్రైవేటు బ్యాంకులపై ఆరోపణల నేపథ్యం లో విచారణ చేపడుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడంతో ఉదయం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ముగింపు దశలో నష్టాలు చూశాయి.

142 పాయింట్లు కోల్పోయిన 
సెన్స్ క్స్ 19,427 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 5,872 వద్ద ముగిసింది. ఈ క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటాపవర్, హీరో మోటో కాప్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభపడ్డాయి. ఐసిఐసిఐ, టాటా మోటర్, గెయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి.

  • Loading...

More Telugu News