: త్రీడీ ప్రింటర్ తో 24 గంటల్లో సుందర భవనం రెడీ
'ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు' సామెత మనకు తెలిసిందే. ఆ రెండూ అత్యంత కష్టమైనవని అర్థం. కానీ, ఇప్పుడు ఇల్లు కట్టడం చాలా ఈజీ. 24 గంటల్లో ఇల్లు కట్టి గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఇందుకు వీలు కల్పిస్తూ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు త్రీడీ ప్రింటర్ ను రూపొందించారు. ఇందులో కాంక్రీట్ సాయంతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన భాగాలను అచ్చు వేసుకోవడం.. తర్వాత రోబో వచ్చి వాటిని ఫిట్ చేయడం చకచక జరిగిపోతాయి.