: జైపాల్ రెడ్డీ.. బహిరంగ చర్చకు సిద్ధమా?: ఉండవల్లి


ప్రకాశం పంతులులాంటి మేధావులు పుట్టిన చోట శుంఠలు పుట్టారంటూ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ తన స్థాయిని మరచి... దిగజారి మాట్లాడారని విమర్శించారు. ఎన్నో విషయాలపై మాట్లాడిన జైపాల్ తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని... చేతనైతే ఆయన చర్చకు రావాలని సవాల్ విసిరారు. బలవంతంగా చేపట్టిన రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన చర్య అని అన్నారు. రాజకీయాలలో సీనియర్ అయిన జైపాల్ రెడ్డి కేసీఆర్ లా మాట్లాడటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News