: టీబిల్లుపై వైఎస్సార్సీపీ చర్చించాలి: రఘువీరా


అన్ని వైపుల నుంచి వైఎస్సార్సీపీపై విమర్శలు పెరుగుతున్నాయి. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చించకుండా, ఓటింగ్ సాకుతో సభనుంచి వాకౌట్ చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి మరోసారి వైఎస్సార్సీపీపై మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా అసెంబ్లీలో వైకాపా టీబిల్లుపై చర్చించి, తమ అభిప్రాయాలను సభ ముందు ఉంచాలని కోరారు. అప్పుడే ఆ పార్టీ అభిప్రాయాలు ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని సూచించారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై వ్యాఖ్యానిస్తూ, ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఆలోచనే లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News