: తిరుమలలో భక్తుల వీరంగం.. కంపార్టుమెంట్ గేట్లు ధ్వంసం...


వీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ అధికారులపై భక్తుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. సామాన్య భక్తులను పట్టించుకోకుండా, వీఐపీలకు రెడ్ కార్పెట్ పరుస్తుండటంతో భక్తులు సహనం కోల్పోయారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నాలుగు కంపార్టుమెంట్ గేట్లను భక్తులు ధ్వంసం చేశారు. సామాన్య భక్తులను టీటీడీ అధికారులు చేతకాని వారుగా భావిస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కారు. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 30 కంపార్టుమెంట్లు నిండి 2కి.మీ వరకు క్యూ లైన్ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనభాగ్యం కోసం ఎన్ని గంటలైనా ఎదురుచూసే భక్తులు... కంపార్టుమెంట్లలో గేట్లు విరగొట్టిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ జరగలేదు.

  • Loading...

More Telugu News