: పాకిస్థానీ ప్రజలూ 'ఆమ్ ఆద్మీ' మార్పును కోరుతున్నారు: ఇమ్రాన్ ఖాన్
మహమ్మద్ అలీ జిన్నా కలగన్నట్లుగా నేడు పాకిస్థాన్ లేదని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయినా, భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ పట్టణ ప్రాంతాలలో మధ్యతరగతి, యువత మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరహా మార్పును వారు ఆశిస్తున్నారని తెలిపారు. భారత ఉపఖండం యూరోప్ లా ఎందుకు లేదని.. పాక్ నుంచి చైనా వరకు ఇంధన కారిడార్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాశ్మీర్ మానవతాపరమైన సమస్య అని, చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని చెప్పారు.