: ఉదయ్ కిరణ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నా: తరుణ్
నటుడు ఉదయ్ కిరణ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో తరుణ్ చెప్పారు. ఉదయ్ ని తనకు మంచి మిత్రుడిగా పేర్కొన్నారు. మంచి నటుడిని సీనీ పరిశ్రమ కోల్పోయిందన్నారు. పరిశ్రమను కొద్దిమందే శాసిస్తున్నారన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు ఆడకపోవడమే ఉండదన్నారు.