: సీమాంధ్రులు కూడా తెలంగాణ సీఎం కావొచ్చు: జైపాల్ రెడ్డి


అమెరికాకు, ఇండియాకు చాలా తేడా ఉందని... అక్కడైతే రెండు పౌరసత్వాలు ఉంటాయని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. మన దేశంలో ఎక్కడ పుట్టిన వారైనా, ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చని చెప్పారు. సీమాంధ్రలో పుట్టిన వారు కూడా తెలంగాణలో పోటీ చేసి... ముఖ్యమంత్రి కావొచ్చని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేసిన షీలాదీక్షిత్ వేరే రాష్ట్రానికి చెందిన వారని జైపాల్ చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ తహశీల్దార్ల సంఘం డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

  • Loading...

More Telugu News