: ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం: కేజ్రీవాల్
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ రోజు లోక్ సత్తా అధినేత జేపీ తనను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు. జేపీ తనతో సమావేశమయ్యారని, అయితే ఈ భేటీ సాధారణమైనదే అని చెప్పారు.