: థర్డ్ ఫ్రంట్ దిశగా సీపీఎం
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. త్వరలోనే లౌకికవాద రాజకీయ పార్టీలన్నీ ఒక కూటమిగా అవతరించనున్నాయని చెప్పారు. ఈ రోజు కొచ్చిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయిందని అన్నారు.