: శరద్ పవార్ ప్రధాని అయితే సంతోషిస్తా: షిండే
ఈ నెల 17న కాంగ్రెస్ ముఖ్యమైన భేటీని నిర్వహించనుంది. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని సమాచారం. అయితే, మహారాష్ట్రలోని షోలాపూర్ లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. శరద్ పవార్ ప్రధాని అయితే తనకు చాలా సంతోషమన్నారు. ఎన్సీపీ అధినేత అయిన పవార్ యూపీఏలో కీలక భాగస్వామి అని, ఢిల్లీ రాజకీయాల్లో ఆయన పాత్ర ప్రధానమైందన్నారు.