: తీహార్ జైలుకు యాసిన్ భత్కల్ తరలింపు
ఇండియన్ ముజాహిదీన్ సహవ్యవస్థాపకుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. గతేడాది నేపాల్ సరిహద్దులో అరెస్టయిన భత్కల్ ను దేశంలోని పలు పేలుళ్ల కేసుల్లో, పలు రాష్ట్రాల పోలీస్ ఏజెన్సీలు నాలుగు నెలల పాటు విచారించాయి. అనంతరం అతడికి, సహచరుడు అసదుల్లా అక్తర్ కు ప్రత్యేక విచారణ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడంతో కారాగారానికి పంపారు.