: చర్చకు సమయం సరిపోలేదని, ప్రక్రియను ఆలస్యం చేస్తారు: కేకే


తెలుగుజాతి రెండుగా చీలిపోయిందని... ఇక కలపడం ఎవరి తరం కాదని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్చ కొనసాగడం లేదని ఈ సందర్భంగా కేకే అభిప్రాయపడ్డారు. చర్చకు సమయం సరిపోలేదన్న సాకుతో, విభజన ప్రక్రియను ఆలస్యం చేసేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News