: అహంకారం, అవివేకం, అవగాహనారాహిత్యం మూడూ కలిపితే కిరణ్: దత్తాత్రేయ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను ఏ ప్రాంతానికి చెందినవాడో కూడా తెలియని స్థితికి దిగజారారని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయనకు ఏమాత్రం నైతికత, చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అహంకారం, అవివేకం, అవగాహనారాహిత్యం మూడూ కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ అని ఎద్దేవా చేశారు. ఇరు ప్రాంతాలకు చెందిన ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని దత్తాత్రేయ తెలిపారు. టీబిల్లుపై చర్చను ప్రాంతాలకు అతీతంగా చర్చించాలని సూచించారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.