: కరుణానిధిని కలసిన అళగిరి
డీఎంకే చీఫ్ కరుణానిధిని ఆయన కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి అళగిరి ఈ రోజు కలిశారు. గోపాళపురంలోని నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. కొంతసమయం తండ్రితో గడిపిన అనంతరం అళగిరి బయటకు వచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తాము రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని, కేవలం కుటుంబ విషయాల గురించి మాత్రమే చర్చించుకున్నామని చెప్పారు. తన తండ్రికి పొంగల్ శుభాకాంక్షలు చెప్పడానికే తాను వచ్చానని తెలిపారు. కొద్ది రోజుల క్రితం అళగిరి వర్గానికి చెందిన ఐదు మంది డీఎంకే నాయకులను కరుణ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, డీఎంకేలో అళగిరి, స్టాలిన్ ల మధ్య వర్గపోరు మరోసారి పతాక శీర్షికలకెక్కింది.