: సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం: పళ్లంరాజు
రాష్ట్ర విభజన బిల్లు తీర్మానంపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం, కేంద్ర కేబినెట్ లో మరోసారి చర్చిస్తామని కేంద్ర మంత్రి పళ్లంరాజు అన్నారు. బిల్లుపై కేంద్ర కేబినెట్ కూడా కొన్ని సవరణలు చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని... అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము అన్ని స్థాయుల్లో పోరాడుతూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ రోజు అన్నవరం సత్యనారాయణస్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.