: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించకపోతే ఆమరణ దీక్ష: విద్యుత్ ఐకాస
ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించినట్టే విద్యుత్ శాఖలో కూడా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. యూనియన్లతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా ఏళ్ల తరబడి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే మరోసారి నిరవధిక సమ్మెను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సాయిబాబు తెలిపారు.