: హంపిలో వేడుకలు చూడతరమా..!


మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే హంపి ఉత్సవాలు నిన్న సాయంత్రం ప్రారంభమయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రా సరిహద్దు జిల్లా బళ్లారిలో ఉన్న హంపి.. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లింది. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, సంపద ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పే సాంస్కృతిక ఉత్సవాలు, నృత్యాలు, క్రీడలతో హంపి ఉత్సవాలు మూడు రోజుల పాటు కోలాహలంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News