: అంతరిక్షంలో కనిపించిన 'దేవుడి చేయి'


అమెరికా స్పేస్ ఏజన్సీ 'నాసా' ఓ ఖగోళ అద్భుతాన్ని విడుదల చేసింది. నాసాకు చెందిన న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ ఆర్ఏ-న్యూస్టార్ తీసిన ఎక్స్ రే ఇమేజెస్ లో చేతిని పోలిన భారీ ఆకారం కనిపించింది. ఈ చిత్రంలో చేతిని పోలిన ఆకారం వెలుగులు విరజిమ్ముతూ ఉంది. ఈ చిత్రాన్ని 'హ్యాండ్ ఆఫ్ గాడ్'గా పిలుస్తున్నారు. అంతరిక్షంలో ఈ ఆకారం ఎందుకు, ఎలా వచ్చింది అనే అంశంపై నాసా పరిశోధనలు ప్రారంభించింది. అయితే, ఫొటోలో ఉన్న చేయి కచ్చితంగా దేవుడిదే అని భక్తులు నమ్ముతున్నారు. గత ఏడాది యూరోపియన్ స్పేస్ ఏజన్సీ కూడా దేవుడి కన్ను అంటూ ఓ ఫొటోను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News