: పెరోల్ గడువు పెంచమంటున్న సంజయ్ దత్


నెల రోజుల పెరోల్ తో ఇప్పటికే బయట ఉన్న నటుడు సంజయ్ దత్ మరో 30 రోజుల పాటు తన పెరోల్ పెంచమని పూణెలోని యరవాడ జైలు అధికారులను కోరుతున్నాడు. సంజయ్ భార్య మాన్యత అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు ముంబై గ్లోబల్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. అయితే, ఆమెకు ఆపరేషన్ చేయాలా? లేదా? అనేది వైద్యులు ఇంకా నిర్ణయించలేదు. ఈ నెల 23కు సంజూ పెరోల్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మాన్యతకు తోడుగా ఉండేందుకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో గత ఏడాది సంజయ్ కు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News