: మమ్ముట్టి, మోహన్ లాల్ తో షారుక్ 'లుంగి డాన్స్'
'చెన్నై ఎక్స్ ప్రెస్' లో షారుక్ ఖాన్ ప్రత్యేక పాట 'లుంగి డాన్స్' ఒక్క రజనీకాంత్ నే కాక ఇతర నటులను కూడా ఆకట్టుకుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తాజాగా మలయాళం సూపర్ స్టార్ లు మమ్ముట్టి, మోహన్ లాల్ తో షారుక్ ఈ పాటకు కాలు కదిపాడు. దుబాయ్ లో నిర్వహించిన సినీ అవార్డుల కార్యక్రమంలో లుంగీ ధరించిన ముగ్గురు ఉత్సాహంగా డాన్స్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోను షారుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వారితో గడపటం చాలా ఆనందంగా ఉందని షారుక్ తెలిపాడు.