: 'జనగణమన' తప్పుగా ఆలపించారని అశోక్ బాబు, గజల్ శ్రీనివాస్ లపై కేసు
జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారన్న ఫిర్యాదుతో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాదులోని నాంపల్లి ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు సైఫాబాద్ పోలీసులను ఆదేశించారు. మార్చి ఆరున దర్యాప్తు నివేదిక సమర్పించాలని తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 7న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఏపీఎన్జీవోలు బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు గజల్ శ్రీనివాస్ కు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, సభలో జాతీయ గీతాన్ని మధ్య మధ్యలో ఆపుతూ తప్పుగా ఆలపించి అవమానించారని తర్వాత ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.