: పదపద.. ఏడాదికి ఒక్కసారే ఉత్తరద్వార దర్శన భాగ్యం


వైకుంఠ ఏకాదశి దివ్య పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని తమ జీవితాలను పుణ్యమయం చేసుకోవడానికి భక్తులు క్యూకట్టారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అర్ధరాత్రి నుంచి రద్దీ కొనసాగుతోంది. రామయ్య గరుడవాహనంలో భక్తులను పరవశింపజేశారు. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాతసేవ, మహా మంగళహారతి సేవలను నిర్వహించారు. ఆది దంపతులు రావణవాహనంపై ఆసీనులై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదిత్యునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్టలో నరసింహస్వామి వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు. ఆరు రోజుల పాటు నిర్వహించే అధ్యయన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాలస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యదేవుడు, సింహాచలం అప్పన్న, బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తదితర ఆలయాలు కూడా భక్తులతో నిండిపోయాయి. ధర్మపురి నరసింహస్వామిని ఎంపీ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News