: ఢిల్లీలో కేజ్రీవాల్ జనతా దర్బార్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో ఈ ఉదయం జనతా దర్బార్ నిర్వహిస్తున్నారు. తన క్యాబినెట్ మంత్రులతో కలిసి దర్బార్ లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం 11.30వరకు దర్బార్ కొనసాగుతుంది. ఇక నుంచి ప్రతి శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు జనతా దర్బార్ కొనసాగుతుందని కేజ్రీవాల్ తెలిపారు.