: రోజూ బడికెళ్తే రెండు రూపాయలు
'నువ్వుగానీ బడికెళితే నీకు రోజూ రెండు రూపాయలు ఇస్తా'నని ఎవరైనా చెబితే ఎవరు మాత్రం బడికి నిలుస్తారు... ఈ విషయాన్ని గమనించిందేమో... కర్ణాటక ప్రభుత్వం ఒకటవ తరగతి చదువుతున్న బాలికలు రోజూ బడికి వస్తే వారికి రోజుకు రెండు రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈనెల ఒకటవ తేదీ నుండి ఒకటవ తరగతి చదువుతున్న బాలిక బడికి వచ్చిన రోజుకు రెండు రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ పద్ధతిని ఈనెల ఒకటవ తేదీనుండి వర్తింపజేయనుంది.
అయితే ఈ మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలి? అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయించనున్నారు. మొత్తానికి బాలికా విద్యను పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం మంచి నిర్ణయాన్నే తీసుకుంది. మరి దీనికి ఎలాంటి స్పందన రానుందో తెలియాల్సి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటివే ఏవైనా ప్రోత్సాహకాలను ప్రవేశపెడితే మన రాష్ట్రంలో కూడా బాలికా విద్య బాగానే పెరుగుతుంది కదా!