: అంతరిక్షంలో మరో అద్భుతం
అంతరిక్షంలో ఒక నక్షత్ర మండలంలో పెద్ద నక్షత్రంతోబాటు బోలెడు చిన్నపాటి నక్షత్రాలు కూడా ఉంటాయి. అలాకాకుండా, ఒకే ఒక నక్షత్రం ఉండే ఏక నక్షత్ర మండలాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన ఏక నక్షత్ర మండలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మన నక్షత్ర మండలంలోని భారీ గ్రహంగా చెప్పదగిన గురుగ్రహానికి రెట్టింపు బరువున్న భారీ గ్రహాన్ని ఫైసీజ్ అనే ఈ ఏక నక్షత్ర మండలంలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నక్షత్ర మండలంలో మన సౌర మండలం లాగా ఈ గ్రహం సమీపంలో ఒకే ఒక్క నక్షత్రం తప్ప మరేమీ లేవు. ఇలా ఏక నక్షత్ర మండలాలు అంతరిక్షంలో చాలా అరుదుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.