: అశోక్ బాబు ముఖ్యమంత్రి అనుచరుడు: వైకాపా నేత పెద్దిరెడ్డి
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ముఖ్యమంత్రి అనుచరుడని వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సమైక్యం పేరుతో అశోక్ బాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సమైక్యం పేరుతో ఆందోళనలు చేస్తూ, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ లాంటి సమైక్యవాదిని కూడా విమర్శిస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా సదుంలో జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రలో ఆయన మాట్లాడారు.