: మన మహిళలు చిదంబరం కంటే తెలివైన వారు: చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వృద్దాప్య పింఛను వెయ్యి రూపాయలకు పెంచుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా, మన తెలుగింటి ఆడపడుచులు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కంటే చాలా తెలివైన వారని చెప్పారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం బాగుపడాలనే హైటెక్ సిటీ, సైబరాబాద్ లను టీడీపీ నిర్మించిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కోటీశ్వరులే మరింత కోటీశ్వరులు అవుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News