: రాహుల్ పై విభేదించిన షిండే, దిగ్విజయ్
రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు విభేదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటోందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. అయితే, ప్రజాస్వామ్యంలో ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అర్హుడని అన్నారు. మరో వారం రోజుల్లో కీలకమైన ఏఐసీసీ సమావేశాలు ఉన్నందున... ఈ లోపలే ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.