: విజయమ్మ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కన్నా


శాసనసభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరుగుతోన్న చర్చలో విజయమ్మ ప్రసంగిస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతిగా మంత్రి కన్నా జోక్యం చేసుకుని, విజయమ్మ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.

అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఏ పార్టీ? అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి నూటికి నూరుపాళ్లూ కాంగ్రెస్ నేతని, 2004లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో కలిసి ఎన్నికల ప్రణాళికలో పార్టీ చెప్పిందే వైఎస్ అమలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి వెల్లడించారు. తమ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీమీద బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని ఆయన విపక్షాలను కోరారు.   . 

  • Loading...

More Telugu News