: ఆమ్ ఆద్మీలో చేరనున్న జేడీ(యు) ఎమ్మెల్యే!


ఢిల్లీ జేడీ(యు)ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఉన్న పార్టీ నుంచి బయటికి వచ్చి ఏఏపీలో చేరతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన వద్దే విలేకరులు ప్రస్తావించగా స్పందిస్తూ.. వారు ఒప్పుకుంటే తనకు ఏఏపీలో చేరాలని ఉందన్నారు. కొన్ని రోజుల్లో దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఇక్బాల్ చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మద్దతు నిరూపించుకునే సమయంలో ఇక్బాల్ ఓటు వేశారు.

  • Loading...

More Telugu News