: బిల్లుకు 31 సవరణలు ప్రతిపాదించిన ఎంఐఎం
రాష్ట్ర విభజన బిల్లుకు ఎంఐఎం పార్టీ 31 సవరణలను ప్రతిపాదించింది. వీటిలో ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి గవర్నర్ లను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. ఉమ్మడి రాజధానిని కేవలం రెండేళ్లు మాత్రమే కొనసాగించాలని, హైదరాబాద్ శాంతిభద్రతలు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని కోరింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సర్వీస్ కమిషన్ ఉండాలని సూచించింది. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలని తెలిపింది.