: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులు అరెస్టు: సీపీ


సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. గత రెండేళ్లుగా నేరాలకు పాల్పడుతున్న వీరిలో ముగ్గురు నకిలీ వీసా కలిగి ఉన్నారని చెప్పారు. వీరంతా వివిధ ఖాతాల్లో ఉన్న డబ్బును పెద్ద మొత్తాల్లో తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్నారని వెల్లడించారు. నిందితులకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి పోలీసులు రూ.61 లక్షలను సీజ్ చేసినట్లు వివరించారు. అందరూ హైదరాబాద్, తమిళనాడు, ఢిల్లీ, ముంబయి ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. వారినుంచి రెండు ల్యాప్ టాప్ లు, మూడు డేటా కార్డులు, ఆరు ఏటీఎం కార్డులు, ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అనురాగ్ శర్మ వివరించారు.

  • Loading...

More Telugu News