: నిమ్స్ ఆసుపత్రిని సీజ్ చేసేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు


ఆస్తిపన్ను బకాయిలు చెల్లించలేదని నిమ్స్ ఆసుపత్రిని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లారు. అయితే తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆసుపత్రిని నడుపుతున్నామని, అలాంటి తమ వద్ద ఆస్తిపన్ను వసూలు చేయడమేంటని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం పన్ను చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

నిమ్స్ ఆరంభం నుంచి ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఉండేది. ఐదేళ్ల క్రితం నిమ్స్ కు ఆస్తిపన్ను మినహాయింపు ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి నిమ్స్ ఆసుపత్రి జీహెచ్ఎంసీకి భారీగా బకాయిపడింది. నిమ్స్ ఏడాదికి 3 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. అది మొత్తం మూడేళ్లకు 12.68 కోట్లు అయ్యింది.

  • Loading...

More Telugu News