: సీమాంధ్ర పేరును తెలుగునాడుగా మార్చండి: మంత్రి డొక్కా
విభజన తరువాత సీమాంధ్ర పేరును ఆంధ్రప్రదేశ్ గా కాకుండా తెలుగునాడుగా మార్చాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పీకర్ కు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై 9 సవరణలు కోరుతూ సభాపతికి నివేదిక అందజేశారు. ఈ నివేదికలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల పునర్విభజన చేయాలని, రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాలు పెంచాలని కోరారు. సాగుభూములను పరిశ్రమలకు కేటాయించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని సూచించారు.